విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ : మంత్రి ఎర్రబెల్లి

Nov 27, 2020 , 13:32:53

హైదరాబాద్‌ : బీజేపీ దేశాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి యుద్ధానికి ప్రేరేపించి, తమ స్వలాభం కోసం ప్రజలను మోసం చేస్తోందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా 4వ మీర్‌పేట హౌసింగ్ బోర్డ్ కాలనీ డివిజన్‌లోని మంగాపురం ఎన్టీఆర్ నగర్, నరసింహ నగర్ కాలనీల్లో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మత ఘర్షణలు అల్లర్లు సృష్టించి ఓట్లను పొందే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తుంటే బీజేపీ వాళ్లు మాత్రం మత ఘర్షణలతో నగరంలో చిచ్చు పెట్టాలని చూస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే డివిజన్‌ని దత్తత తీసుకొని కడిగిన ముత్యంలా చేస్తానన్నారు.


తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD