వాళ్లకు మాత్రం ఓ విద్య బాగా తెలుసు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం రాంనగర్ చౌరస్తాలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాంనగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి, అడిక్‌మెట్ అభ్యర్థి హేమలత జయరాంరెడ్డి, ముషీరాబాద్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి బల్దియాకు పంపించాల్సిందిగా అభ్యర్థించారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్ని భయాలు పెట్టారో.. ఆంధ్రా-తెలంగాణ పంచాయతీ అయితదన్నారు. కరెంటు ఉండదన్నారు. ఉద్యోగాలు రావన్నారు. కొత్త పెట్టుబడులేమో గానీ ఉన్నవి పోతయన్నరు. ఇలా ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతుందన్నారు. ఆరేళ్ల తర్వాత పేదవాడికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరారు.
ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకు బ్రిడ్జి..
ముషీరాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్ చౌరస్తాను బాగు చేయాలని ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు రూ. 450 కోట్లు మంజూరు చేసి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. వరద సాయం చేసేందుకు మనసొప్పదు కానీ.. బురద రాజకీయం మాత్రం చేస్తారన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని నాలుగు ఓట్లు రాల్చుకోవాలనే తప్పా బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. మతం మత్తులో ఉద్వేగాల మాటున వాళ్లు చేసే రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులకు మాత్రం ఒక విద్య మాత్రం బాగా తెలుసన్నారు. ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజమని భ్రమింపజేసే కథ మాత్రం బాగా తెలుసు అన్నారు.
తాజావార్తలు
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్‌గా చిత్రించారు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు