శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 14:23:06

కూకట్‌పల్లిలో బీజేపీ కార్యాలయం ధ్వంసం

కూకట్‌పల్లిలో బీజేపీ కార్యాలయం ధ్వంసం

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కాషాయ పార్టీలో కలహాలు కొనసాగుతున్నాయి. పార్టీ ముఖ్యనేతల తీరుపై కార్యకర్త ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది.. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కట్టబెడుతున్నారంటూ మండిపడుతున్నారు. శుక్రవారం పలువురు కూకట్‌పల్లిలోని ఆ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్పొరేటర్‌ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ కార్యాలయంపై దాడికి దిగారు. పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా టికెట్లను రూ.30లక్షలకు సీట్లు అమ్ముకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు హరీశ్‌రెడ్డిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. కార్పొరేటర్‌ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. నాచారం నుంచి బీజేపీ టికెట్‌ ఆశించిన విజయలత అశ్వత్థామారెడ్డి పార్టీ టికెట్‌ కేటాయించకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించగా హాస్పిటల్‌ పాలైన విషయం తెలిసిందే. గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచే నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నాలుగు రోజులుగా వరుస నిరసనలతో నగరంలోని బీజేపీ కార్యాలయాలు సామాన్య కార్యకర్తల నిరసనలతో అట్టుడుకుతున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.