శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 01:32:46

అభివృద్ధికి బీజేపీ మోకాలడ్డు

అభివృద్ధికి బీజేపీ మోకాలడ్డు

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు l రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

మహబూబాబాద్‌/ కేసముద్రం జనవరి 22: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని.. ప్రతి కార్యకర్త వాటిని ప్రజలకు వివరించాలని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌, కేసముద్రంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అధ్యక్షతన శుక్రవారం పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. కేసముద్రంలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, రెండు చోట్ల ఎంపీ మాలోత్‌ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గతం లో ఏ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధ్ది, సంక్షే మం కోసం ఆలోచన చేయలేదని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని విమర్శించా రు. దేశంలో బీజేపీపాలిత రాష్ర్టాల కంటే తెలంగాణలో తలసరి ఆదాయం 14.5 వృద్ధి రేటుగా ఉన్నదని వివరించారు. కొంతమంది తెలిసీతెలియని బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని ఆరోపించడంలో ఎలాంటి వా స్తవం లేదన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, కరోనా సమయంలో సైతం సం క్షేమ పథకాలను అమలు చేసిన ఘన త సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 32 వేల పోలీసు కానిస్టేబుళ్లు, 9 వేల పంచాయతీ కార్యదర్శులు, 24 వేల విద్యుత్‌ ఉద్యోగాలు, పబ్లిక్‌ కమిషన్‌ ద్వారా 35 వేలు, సింగరేణిలో 13 వేలు, ఆర్టీసీలో 6 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. త్వరలో నిరుద్యోగులకు నోటిపికేషన్లు, ఉద్యోగులకు సైతం పీఆర్సీని అందిస్తామని చెప్పారు. త్వరలోనే పదోన్నతులు చేపట్టి ఖాళీలను గుర్తించి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేస్‌ వంటి సంస్థలను ప్రైవేట్‌ పరం చేసిందన్నారు. ప్రతి సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని, ప్రతిఒక్కరు అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు చేయాలని కోరారు. 

VIDEOS

logo