మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 24, 2020 , 16:50:42

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వ చర్యలు అభినందనీయం

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వ చర్యలు అభినందనీయం

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలకు తెలంగాణ బీజేపీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల దృష్ట్యా కొంతమంది స్వలాభం కోసం నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. దీంతో సామాన్య, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ధరల నియంత్రణను చేపట్టగలరని సీఎంకు సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం అయ్యేలా చూడాలని సీఎంను ఆయన కోరారు. కరోనాపై పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు బీజేపీ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.


logo