శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 00:50:16

బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలి

బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలి

  • జర్నలిస్టులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం 
  • టీయూడబ్ల్యూజే నేత విరాహత్‌ అలీ 

సిద్దిపేట టౌన్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై జర్నలిస్టు సంఘం మండిపడింది. జర్నలిస్టులపై ఆయన చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. బండి సంజయ్‌ వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ డిమాండ్‌చేశారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తారని, వారికి జెండాలు, అజెండాలు లేవని, సమాజ సేవే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జర్నలిస్టుగా పనిచేసిన రఘునందన్‌రావును అడిగి తెలుసుకోవాలని సూచించారు. రఘునందన్‌ ఇంట్లో సోదాలు జరిగితే బీజేపీ నేతలు.. జర్నలిస్టులను వ్యక్తిగతంగా దూషించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. బండి సంజయ్‌ గల్లీ లీడర్‌గా వ్యవహరించారని విమర్శించారు. జర్నలిస్టులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమని, క్షమాపణ చెప్పాలని సంఘం జిల్లా అధ్యక్షుడు రంగాచారి డిమాండ్‌చేశారు. సమావేశంలో జర్నలిస్టు నాయకులు అంజయ్య, కూతురు రాజిరెడ్డి, పెద్ది సుభాశ్‌, రఘునందన్‌, ఫయాజ్‌, దుర్గారెడ్డి, హఫీజ్‌, సంజీవరెడ్డి, మైసారెడ్డి, సుధాకర్‌, మజ్జు, సాజిద్‌ ఉన్నారు.