బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 13:31:31

విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందిన బీజేపీ, ఎంఐఎం: మంత్రి ఎర్రబెల్లి

విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందిన బీజేపీ, ఎంఐఎం: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ, ఎంఐఎం లబ్ధిపొందాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఎంఐఎంతో పొత్తు లేకుండానే గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంటామని చెప్పారు. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, కంప్రెషర్‌, క్లీనింగ్‌ యంత్రాలను మంత్రి ప్రారంభించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో మరోసారి నిరూపితమయ్యిందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టడం వల్లే ఆ రెండు పార్టీలు ఎక్కువ సీట్లు గెలుపొందాయని విమర్శించారు. 

అంతకుముందు గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం సాధించిన మీర్‌పేట హౌసింగ్‌ బోర్డ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభుదాస్‌ మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. తన గెలుపునకు సహరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్‌ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీంతో మీర్‌పేట హెచ్‌బీ కాలనీ డివిజన్‌ను తాను దత్తత తీసుకుంటున్నాని మంత్రి ప్రకటించారు.    


logo