గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 10:51:37

బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ : మంత్రి హరీశ్‌రావు

బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ : బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం దుబ్బాక మండలం రాజక్కపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తుందని విమర్శించారు. బీజేపీ నేతలు ఉద్యోగాలపై మాట్లాడుతున్నారని.. మోదీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఆరేళ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, ఎంత మందికి జాబ్‌లు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో లక్షా 24వేల మందికి ప్రభుత్వ కొలువులు ఇచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ ఓటేస్తే కాలిపోయే మోటార్లు.. బీజేపీకి ఓటేస్తే బాయి కాడా మోటార్లు అన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్టేనన్నారు.

ఆ నాడు కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉండకపోయేదనని, కేసీఆర్‌ హయాంలో 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారన్నారు. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.లక్షల బీమా ఇస్తున్నామని, పెట్టుబడికి ఎకరానికి రూ.5వేలు అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. పెన్షన్లపై చర్చకు బస్టాండ్‌కు రమన్న బండి సంజయ్‌ ఇప్పటి వరకు పత్తాలేడన్నారు. దుబ్బాకను రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ వాళ్ల ఇండ్లు తెలియదు. కానీ ఆటో ఎక్కితే హరీశ్‌రావు ఇంటికాడ దించుతడు.. గా ఉత్తమ్‌, బండి సంజయ్‌కి ఏం ఎరుక రాజక్కపేట కష్టాలు అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.