ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 16:39:07

బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరికలు

బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరికలు

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి భారీగా ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం మాదాపూర్‌కు చెందిన జై శ్రీరామ్‌ యూత్‌, బీజేపీ నాయకులు 70 మంది డివిజన్‌ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన బీజేపీ నాయకులకు విప్‌ గాంధీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పాలన, ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలే అందిరిని ఆకర్షిస్తున్నాయన్నాయని తెలిపారు.మెరుగైన పాలన, ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ ముందుకుసాగుతుందన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధి ఆగకుండా వేగంగా సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, యువ మంత్రి కేటీఆర్‌ల మార్గనిర్దేశకత్వంలో ముందుకు సాగుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందు వరుసలో నిలబెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సాంబశివరావు, గుమ్మడి శ్రీను, రాంచందర్‌, సత్యరెడ్డి, సాయి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.