శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 26, 2020 , 20:58:27

దుబ్బాకలో ఓట‌ర్ల కోసమే న‌గదు: సీపీ జోయ‌ల్ డేవిస్

దుబ్బాకలో ఓట‌ర్ల కోసమే న‌గదు: సీపీ జోయ‌ల్ డేవిస్

సిద్దిపేట‌: సిద్దిపేట వ‌న్ టౌన్ పీఎస్ లో సీపీ జోయ‌ల్ డేవిస్ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ర‌ఘునంద‌న్ రావు మామ రాంగోపాల్ రావు, బంధువు అంజ‌న్ రావు ఇంట్లో సోదాలు నిర్వ‌హించ‌డం జ‌రిగింది. అంజ‌న్ రావు ఇంట్లో రూ.18.67 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకున్నాం. దుబ్బాక‌లో ఓట‌ర్ల‌కు పంపిణీ చేసేందుకే డ‌బ్బులు తెచ్చారు. పంపిణీ చేసేందుకు తెచ్చిన డ‌బ్బును సీజ్ చేశామ‌న్నారు.

అంజ‌న్ రావు ఇంటి వైపు ర‌ఘునంద్ రావు, బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా వ‌చ్చాయి. పోలీసుల నుంచి రూ.5.07 ల‌క్ష‌లు తీసుకెళ్లారు. డ‌బ్బులు తీసుకెళ్లిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.