మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 17:44:48

బీజేపీ నేతలు హుందాగా ప్రవర్తించాలి

బీజేపీ నేతలు హుందాగా ప్రవర్తించాలి

పెద్దపల్లి : దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు ప్రజలు రాజకీయాలంటేనే ఏవగించుకునేలా ఉన్నాయని శాసన మండలి ప్రభుత్వ విప్ ప్రసాదరావు అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన నియోజకవర్గంలోని లబ్ధిదారులకు  సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు రాజకీయాలను బ్రష్టు పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. 

 ఇలాంటి విధానాలు సరైనవి కావని రాజకీయాలంటే ప్రజల్లో గౌరవం హుందాతనం పెరిగేలా ఉండాలి తప్ప ఇలాంటి పద్ధతులు సరికాదన్నారు. ఒక పార్లమెంట్‌ సభ్యుడు మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదని, ఇలా మాట్లాడకూడదని హితవు పలికారు. ఒక ఎంపీ మాట్లాడితే గర్వపడేలా ఉండాలి కానీ ఎన్నుకున్న ప్రజలే అవమాన పడేలా ఉండకూడదని హితవు పలికారు. రాజకీయాల్లో నైతిక విలువలను పాటించాలని ఆయన సూచించారు.