ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 01:58:36

బుట్టలో పడిన బీజేపీ

బుట్టలో పడిన బీజేపీ

  • కేసీఆర్‌ స్థానంలో మోదీ ఫొటోతో సొంత డబ్బా
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ మండిపడుతున్న నెటిజన్లు

జనగామ రూరల్‌: అనుకరణకూ హద్దుండాలి. ఆనందానికి, ఆగ్రహానికి తేడా తెలిసుండాలి. కానీ, ఇదేమీ పట్టని బీజేపీ నాయకులు సోయిలేకుండా మార్ఫింగ్‌ ఫొటోతో ప్రచారానికి తెగబడ్డారు. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టానికి రైతులు జేజేలు పలికారు. సీఎం కేసీఆర్‌ను దేవుడిలా కొలుస్తూ జోతలు పట్టారు. కానీ, కేంద్రంలో బీజేపీ తెచ్చిన రైతు చట్టాలపై దేశవ్యాప్తంగా అన్నదాతలు భగ్గుమంటున్నారు. ట్రాక్టర్లు తగులబెట్టి నిరసనలు తెలిపారు. ఈ వ్య త్యాసం తెలియని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ బీజేపీ నాయకులు తమ ప్రచారం కోసం కక్కుర్తిపడ్డారు. జనగామ జిల్లా పెంబర్తికి చెందిన రైతు బండ రాములు తన వ్యవసాయ పొలం వద్ద నెత్తిన గంపలో తన కొడుకుతోపాటు కేసీఆర్‌ చిత్రపటంతో సంబురంగా సెప్టెంబర్‌ 14న ఫొటో దిగాడు. అదే ఫొటో ‘నమస్తే తెలంగాణ’ సెప్టెంబర్‌ 15న మెయిన్‌ మొదటిపేజీలో ప్రచురించింది. ఎక్కడేమీ దొరకలేనట్టుగా ఇదే ఫొటోను బీజేపీ నాయకులు వాడుకుంటున్నారు. కేసీఆర్‌ స్థానంలో మోదీ ఫొటో మార్ఫింగ్‌ చేసి ప్రచారానికి తెగబడ్డారు. ఈ బాగోతం తెలిసిన ప్రజలు బీజేపీ నాయకుల తీరును చూసి నవ్వుకుంటుండగా మరికొందరు మండిపడుతున్నారు. 


logo