దమ్ముంటే అధికారిక చర్చకు రండి

- తొండి బండీలు కాదు.. కేంద్రమంత్రులు రావాలి
- గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి సవాల్
మల్లాపూర్, జనవరి 10: సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలతో తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నాయకులను ప్రజలు త్వరలోనే తరిమికొడుతారని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. భాగ్యలక్ష్మి, భద్రకాళి దేవాలయాలు కాదు.. దమ్ముంటే చేసిన అభివృద్ధి మీద అధికారిక చర్చకు రావాలని సవాల్ విసిరారు. తొండి బండీలు కాదు, కేంద్ర మంత్రులు చర్చకు రావాలని చెప్పారు. ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్-2లో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జీ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం రాష్ర్టానికి నిధులు కేటాయించకున్నా సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు బీజేపీ వరద సహాయం చేయలేదని అన్నారు. ప్రజలు బీజేపీని నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, సిట్టింగ్ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్‌పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్
- జనం మెచ్చిన గళం గోరటి వెంకన్నది
- శెభాష్...సిరాజ్: మంత్రి కేటీఆర్
- త్వరలో కామన్ మొబిలిటీ కార్డు: హైద్రాబాదీలకు ఫుల్ జాయ్
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి