ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 11:22:41

టీఆర్ఎస్ లోకి బీజేపీ నాయకులు

టీఆర్ఎస్ లోకి బీజేపీ నాయకులు

నిజామాబాద్ : టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని మాక్లూర్ మండలం బీజేపీ మండల అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, కల్లెడ సర్పంచ్ లావణ్యలు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి  కార్యక్రమాలను చూసే టీఆర్ఎస్ లో చేరినట్లు వారు తెలిపారు.


logo