శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 13:28:44

దుబ్బాక బీజేపీలో భ‌గ్గుమ‌న్న విభేదాలు

దుబ్బాక బీజేపీలో భ‌గ్గుమ‌న్న విభేదాలు

సిద్దిపేట : దుబ్బాక బీజేపీలో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావుకు అస‌మ్మ‌తి సెగ మొద‌లైంది. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని స్థానిక బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. రఘునంద‌న్ రావు ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. 

దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీజేపీ నాయ‌కుడు క‌మ‌లాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎప్ప‌ట్నుంచో ప‌ని చేస్తున్న త‌న‌ను వ‌దిలేసి రఘునంద‌న్‌రావుకు టికెట్ ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన‌ కార్య‌క‌ర్త‌ను కాద‌ని  ఒక రేపిస్ట్‌కు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ టికెట్ కేటాయించింది. నిబ‌ద్ద‌త‌, నిజాయితీతో పార్టీ కోసం ప‌ని చేసిన త‌న‌ను బీజేపీ వ‌దిలేసింది. అవినీతితో, అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించిన అహంకారికి టికెట్ ఇచ్చింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ డ‌బ్బు వైపే మొగ్గు చూపింద‌న్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా ర‌ఘునంద‌న్‌రావును ప్ర‌క‌టించ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు. ఈ విష‌యంలో బండి సంజ‌య్ మ‌రోసారి ఆలోచించాల‌ని ఆయ‌న కోరారు.

ర‌ఘునంద‌న్‌రావుకు బీ ఫామ్ ఇవ్వ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు దుబ్బాక‌కు చెడ్డ పేరు తీసుకువ‌చ్చిన రఘునంద‌న్‌రావుకు టికెట్ ఇవ్వ‌డం దారుణం. ఇది పార్టీ ఎదుగుద‌ల‌కు, గెలుపుకు అస‌లు ఉప‌యోగ‌ప‌డ‌దు అని తేల్చిచెప్పారు. 2014, 2018 ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా రాలేదు. అందుకు కార‌ణం ఇక్క‌డ స‌రైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌క‌పోవ‌డ‌మే అని చెప్పారు. 2019లో మెద‌క్ పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేయించినా కూడా గెలువ‌లేదు. ఓడిపోయే వ్య‌క్తికి మ‌ళ్లీ టికెట్ ఇవ్వ‌డం దుర్మార్గ‌పు చ‌ర్య‌ అని క‌మ‌లాక‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు.


logo