బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 16:47:54

విద్వేషపూరిత రాజకీయాలను తిప్పికొట్టాలి : మంత్రి కొప్పుల

విద్వేషపూరిత రాజకీయాలను తిప్పికొట్టాలి : మంత్రి కొప్పుల

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టిందుకు బీజేపీ నాయకులు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉంటున్న హిందూ, ముస్లిం మధ్య వైషమ్యాలు పెంచేలా కాషాయ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలను హైదరాబాదీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వెంకటాపురం డివిజన్ ఆదివారం ఆయన టీఆర్ఎస్‌ అభ్యర్థితో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా స్థానికంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ. 600 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల పేరుతో సాయాన్నిఅందకుండా బీజేపీ అడ్డుకుంది. ఈ ఆరేండ్లలో హైదరాబాద్ గొప్పగా అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం, శాంతి నెలకొనడంతో పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. హైదరాబాద్‌ అభివృద్ధికి యంగ్, డైనమిక్ లీడర్ కేటీఆర్‌ దృఢ సంకల్పంతో పని చేస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు స్థానిక టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి సమావేశమై పార్టీ అభ్యర్థి విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.