గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 21:07:17

రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు : మంత్రి కొప్పుల

రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు : మంత్రి కొప్పుల

హైదరాబాద్‌ : దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.  హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు వరదల బారినపడ్డారన్నారు. ముంపు బాధితులకు సీఎం కేసీఆర్‌ రూ.10వేల చొప్పున సహాయం అందించి ఆదుకున్నారన్నారు. ప్రజలకు సహాయం అందిస్తే ఓర్వలేక బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసి సాయం పంపిణీని అడ్డుకుందని, తమ పార్టీని గెలిపిస్తే రూ.25వేల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినందునే కాళేశ్వరం వంటి గొప్ప సాగునీటి ప్రాజెక్టును నిర్మించి తాగు, సాగునీటి కష్టాలు తీర్చారన్నారు.


వ్యవసాయానికి, పరిశ్రమలు, గృహాలకు 24గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా అవుతోందన్నారు. రూ.68వేల కోట్లతో హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. నగరానికి రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇంకా వస్తాయన్నారు. నగరంలో సజావుగా ఉన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు మతం, దేశభక్తి, సరిహద్దు వివాదాలకు ముందుకు తెచ్చి ఓట్ల రాజకీయాలు చేస్తున్నారే తప్ప ప్రజల బాగోగుల గురించి వారికి ఏ మాత్రం ఆలోచన లేదని విమర్శించారు. తెలంగాణ, హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌, టీఆర్‌ర్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


logo