e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News దళిత బంధుపై బీజేపీ తప్పుడు ప్రచారం

దళిత బంధుపై బీజేపీ తప్పుడు ప్రచారం

కరీంనగర్ : దళిత బంధు పథకం మీద బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రవిశంకర్‌ మాట్లాడారు. దళితులకు ఏం చేద్దామని నాలుగు సంవత్సరాల క్రితమే సీఎం కేసీఆర్ నన్ను అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల ఆత్మహత్యలు, చేనేత ఆత్మహత్యలు, ఎన్ కౌంటర్లు ఉన్న తెలంగాణ ఈ రోజు ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు.


జీఎహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి, కారు పోతే కారు అన్నరు ఏమైందని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి ఎంపీగా గెలిచింది బండి సంజయ్‌ మాత్రమే అన్నారు. నటలో బండి సంజయ్‌కు ఆస్కార్ ఆవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. బీజేపీ డ్రామాలు మొదలు పెట్టిందని విమర్శించారు. ఈటల అస్వస్థతకు గురవడాన్ని ప్రజలు ఎట్ల నమ్ముతరని ప్రశ్నించారు.

- Advertisement -

దళిత బంధును ఆపేందుకు కోర్టుకు వెళ్లారు. దళితులను బానిసలుగా చూసిన వ్యక్తి ఈటల రాజేందర్ అని మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్న దళిత బంధు ఆగదు. బల్ల గుద్ది చెప్తున్న దళిత బంధు కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ప్రగతి భవన్ పేల్చుతామని బండి సంజయ్ పిచ్చి లేసి మాట్లాడుతున్నడు.

కోటి ఉద్యోగాలు, రూ.15లక్షలు ఆకౌంట్‌లో వేశారా? ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులను నిలదీశారు. క్యూ న్యూస్ మల్లన్నను తీసుకు వెళ్లి పిచ్చి హాస్పిటల్‌లో వెయ్యాలన్నారు. ఈటల తన అల్లుడి కాళ్లు కూడా కడుగలేదు. కానీ దళితులతో కాళ్లు కడిగిచ్చుకుంటుండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

ఇద్దరు చైన్‌ స్నాచర్ల అరెస్ట్‌

బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి

వెలుగులోకి మరో పోర్న్‌ రాకెట్ ..క‌ట‌క‌టాల వెనక్కి వర్ధమాన న‌టి

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా స్విమ్మ‌ర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana