మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:33

బీజేపీ కార్పొరేటర్‌ భర్త దౌర్జన్యం

బీజేపీ కార్పొరేటర్‌ భర్త దౌర్జన్యం

  • రూ.50 వేలు ఇవ్వలేదని 
  • ఇల్లు కూల్చివేతకు యత్నం

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సామాన్యులపై బీజేపీ కార్పొరేటర్‌ భర్త దౌర్జన్యానికి దిగాడు. జిల్లాకేంద్రంలోని పాటీగల్లీలో రాంచందర్‌ అనే వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న 48వ డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ వనిత భర్త శ్రీనివాస్‌ రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అయితే డబ్బులు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన శ్రీనివాస్‌ సోమవారం మున్సిపల్‌ అధికారులతో కలిసి ఇంటి స్లాబ్‌, గోడలను కూల్చివేయించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అన్యాయంగా తమను వేధింపులకు గురిచేస్తున్న శ్రీనివాస్‌పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.