బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 20:55:47

జంతు ప్రేమికులపై బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థి భర్త దాడి

 జంతు ప్రేమికులపై బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థి భర్త దాడి

హైదరాబాద్‌ :  జంతు ప్రేమికులను, జంతు హక్కుల కార్యకర్తల(యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌)పై సోమాజిగూడ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్ధి విజయదుర్గ భర్త సందీప్ యాదవ్ తన అనుచరులతో కలిసి విక్షణరహితంగా దాడి చేశారు. ఐఏఎస్  కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి సౌరవ్‌ను సందీప్ యాదవ్ తన అనుచరులు శ్రీశైలం యాదవ్, అర్జున్ యాదవ్‌లతో కలిసి చావబాదాడు.

వీధి కుక్కలకు ఆహారం తినిపించాననే  కారణంతో తమపై దాడి చేశారని సౌరవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ కళానిధి పర్వతవర్ధిని మీడియాతో మాట్లాడుతూ.. జంతు ప్రేమికులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన సందీప్‌ యాదవ్‌ భార్యను కార్పొరేటర్‌గా గెలిపిస్తే ఆయన మరింత అమానుషంగా వ్యవహరించే అవకాశముందని, ఆమెను ఎన్నుకోద్దని ఓటర్లను అభ్యర్థించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo