శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:48:29

ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మ దహనం

ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మ దహనం

డిచ్‌పల్లి(ఇందల్వాయి): సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసిన ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మను నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అర్వింద్‌ పబ్బం గడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు తప్పుడు హామీలిచ్చి రైతులను మోసం చేశారని విమర్శించారు. జిల్లా అభివృద్ధి కోసం ఒక్క పని కూడా చేయని అర్వింద్‌.. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తున్న సీఎంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పల్వాయి రజనీకాంత్‌, తుమ్మల గణేశ్‌, అనిల్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. logo