e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home తెలంగాణ బీజేపీది పచ్చిమోసం

బీజేపీది పచ్చిమోసం

బీజేపీది పచ్చిమోసం
  • అసెంబ్లీ సీట్ల పెంపులో దగా
  • జమ్మూకశ్మీర్‌లోనే ఎలా పెంచుతారు?
  • కిషన్‌రెడ్డి, బండికి మాట్లాడే దమ్ములేదా?
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ప్రశ్న

తిమ్మాపూర్‌, జూలై 10: అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. శనివా రం కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌, నుస్తులాపూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం వినోద్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు అవకాశం కల్పిస్తూ చట్టం చేస్తే ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. అసెంబ్లీ స్థానాల పెంపుపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోదీని కలి సి లిఖిత పూర్వకంగా లేఖను సమర్పించినా స్పందన లేదన్నారు. తాను కూడా ప్రధాని, అప్పటి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని కలిసి అనేకసార్లు విన్నవించినట్టు గుర్తుచేశారు. అప్పటి పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సైతం పెంచాలని కోరుతూ ప్రతిపాదన చేసినా ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఓట్లు, సీట్లు, సీఎం పదవి కోసం జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలను పెంచుతున్నారని, ఇకడ ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌కు ఒక న్యాయం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఒక న్యాయమా? అని నిలదీశారు. చట్ట ప్రకారం రాష్ట్రంలో 34 అసెంబ్లీ స్థానాలు పెంచుకునే అవకాశం ఉన్నదన్నారు. 2025 వరకు సీట్లను పెంచరాదని రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఎలా పెంచుతుందని ప్రశ్నించారు. బీజేపీ జాతీయత ఎటు పోయిందని, వన్‌నేషన్‌, వన్‌లా అని మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్లమెంట్‌లో మాట్లాడాలని, పార్టీ నాయకత్వాన్ని కూడా ప్రశ్నించాలని కోరారు. లేదంటే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీజేపీది పచ్చిమోసం
బీజేపీది పచ్చిమోసం
బీజేపీది పచ్చిమోసం

ట్రెండింగ్‌

Advertisement