సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 02:06:30

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ పచ్చిమోసగాడు

బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ పచ్చిమోసగాడు

  • నాకు తీరని అన్యాయం చేశాడు
  • దుబ్బాక ఉపఎన్నికలో అతడి బండారం బయటపెడతా
  • మీడియాతో బాధిత మహిళ రాధారమణి

దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు పచ్చి మోసగాడని, తనకు తీరని అన్యాయం చేశాడని బాధిత మహిళ రాధారమణి ఆరోపించారు. శనివారం సాయంత్రం ఆమె నామినేషన్‌ పత్రా లు తీసుకునేందుకు దుబ్బాక రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రఘునందన్‌ చేసిన అన్యాయాన్ని తలుచుకుని కన్నీరు మున్నీరైంది. అతడిపై కొన్నాళ్లుగా పోరా టం చేస్తున్నానని, హెచ్‌ఆర్సీలో కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ అతడితో తనకు ముప్పు ఉన్నదన్నారు. ఆయన చేసిన మోసాలను దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు చెప్పడానికే వస్తున్నానన్నారు. త్వరలోనే తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. రఘునందన్‌రావు వంద తలల రావణాసురుడు, భూ బకాసురుడు, నరకాసురుడు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడి కారణంగా మరే మహిళ మోసపోవద్దనే తాను ఈ యుద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు దుబ్బాక ప్రజలు మద్దతునిచ్చి తనకు అండగా నిలువాలని రాధారమణి కోరారు.logo