విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్ : ప్రజల మధ్య మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా అని, బీజేపీ అంటే బక్వాస్ జ్యాదా పార్టీ అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ జీవన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో ప్రభుత్వ విప్ భానుప్రసాద్, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాషాయం పార్టీలో క్రమశిక్షణ లోపించిందని, గాడ్సే వారసులే ఆ పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ కేసీఆర్ అని బీజేపీ కొందరిని స్టువర్టుపురం దొంగల్లా ఆయనపైకి వదిలిందని మండిపడ్డారు.
కేంద్ర అగ్ర పదవుల్లో బీజేపీ గుజరాత్ వాళ్లను నింపేసింది. వరద బాధితులకు రూ. 25 వేలు సాయం చేస్తామని ముఖం చాటేసింది. రాష్ట్రాభివృద్ధికి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నయాపైసా తెచ్చారా ? అని ప్రశ్నించారు. బీజేపీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ సొంత రాష్ట్ర రైతులు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. ఛుగ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి. రైతులతో పెట్టుకున్నోడు బాగుపడలేదని ఛుగ్ గుర్తు పెట్టుకోవాలని జీవన్‌రెడ్డి అన్నారు. కేంద్ర సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆయన ఆక్షేపించారు. బీజేపీ నాయకులు మాటలు జాగ్రత్తగా వాడాలని హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు తెలంగాణకు వచ్చి అభివృద్ధి చూడాలని సూచించారు.
అనంతరం ప్రభుత్వం విప్ భానుప్రసాద్ మాట్లాడుతూ.. తరుణ్ ఛుగ్ పంజాబ్ రైతులను అర్బన్ నక్సల్స్ తో పోల్చారు. అలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ఎక్కడైనా ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాలు విసిరారు. బండి సంజయ్ ఎంపీగా కరీంనగర్‌కు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మతపరమైన ఎజెండాతో బీజేపీ ప్రజల్లో ఎక్కువ కాలం నిలువలేదని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతి అయోగ్ చెప్పినా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ సాధనకు 14 ఏండ్లు పోరాటం చేశారు. రాష్ట్రాభివృద్ధికి అంతే పట్టుదలతో పనిచేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
- అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు.. పీపీఈ కిట్‌లో అనుమానితుడు
- రోదసీలో అడుగిడిన యూరి గగారిన్ జయంతి.. చరిత్రలో ఈరోజు
- తన కుక్కల్ని వైట్‌హౌజ్ నుంచి పంపించేసిన బైడెన్
- రాహుల్‌కే పార్టీ పగ్గాలు : యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం!
- కొండగట్టు అంజన్న భక్తుల కొంగు బంగారం : ఎమ్మెల్సీ కవిత
- గుడ్‌న్యూస్.. కొవాగ్జిన్ సేఫ్ అని తేల్చిన లాన్సెట్
- ఉభయసభలకు పెట్రో సెగ.. 2 వరకు వాయిదా
- వాళ్లను జైలుకు పంపకుండా విడిచిపెట్టను: బీజేపీ ఎమ్మెల్యే
- రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్
- రూ.12 వేలు తగ్గిన బంగారం: పెట్టుబడికి ఈ టైం సరైందేనా?!