మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 13:01:34

యువకులే టీఆర్ఎస్ సైనికులు : హ‌రీష్ రావు

యువకులే టీఆర్ఎస్ సైనికులు : హ‌రీష్ రావు

సిద్దిపేట : యువ‌కులే టీఆర్ఎస్ పార్టీ సైనికులు అని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆనాజ్‌పూర్‌, తిమ్మ‌క్క‌ప‌ల్లి గ్రామాల‌కు చెందిన బీజేపీ యువ‌కులు హ‌రీష్ రావు స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా యువ‌కులంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి హ‌రీష్‌రావు పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.  

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని.. అలాంటి వారు టీఆరెస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని   అన్నారు. యువతను ఆకర్షించేలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు చెబుతున్న విషయాన్ని గ్రహించి పని చేసే పార్టీ వైపు వచ్చిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కళ్ళ ముందు కనిపించని నాయకులకు దుబ్బాక నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. యువతకు ఏ అవసరం వచ్చినా ఈ ప్రాంతంలో నేను, రామలింగన్న అండగా నిలబడ్డామని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లు పెట్టి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపామని చెప్పారు. జాబ్ మేళాలు నిర్వహించి ప్రయివేట్ ఉద్యోగాలను వారి కళ్ళ ముందుకే తెచ్చామన్నారు. వారికి ఉపాధి కల్పించడం కోసం ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని హరీష్ రావు గారు వివరించారు. ఇవన్నీ జరిగిన వాస్తవాలే తప్ప కాంగ్రెస్, బీజేపీలు చెప్పే కళ్ళబొల్లి మాటలు కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక, రాయ్ పోల్ మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo