బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 09:33:57

హయత్‌నగర్‌లో డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ నేతలు

హయత్‌నగర్‌లో డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ నేతలు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో దుందుడుకుగా వ్యవహరించిన జీబేపీ, తాజాగా ఓటర్ల ప్రలోభాలకు దిగింది. హయత్‌నగర్‌ డివిజన్‌లోని డివిజన్‌లోని బంజారకాలనీలో నిన్న అర్ధరాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతూ బీజేపీ సీనియర్‌ నేత ఘంటా ప్రభాకర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘంటా ప్రభాకర్‌ రెడ్డి సహా డబ్బులు పంచుతున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద లభించిన రూ.50 వేలు, రెండు స్కూటీలను సీజ్‌ చేశారు. 


ఇదేవిధంగా నిన్న సాయంత్రం ససరూర్‌నగర్‌ డివిజన్‌లో బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. సరూర్‌నగర్‌ డివిజన్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆకుల శ్రీవాణి భర్త అంజన్‌ బీజేపీ నేతలతో కలిసి సరూర్‌నగర్‌ డివిజన్‌ అంబేద్కర్‌నగర్‌లో ఎలక్షన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓట్లరు డబ్బులు పంచుతుండగా, విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడకు చేరుకొని బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడిచేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు అక్కడకు చేరుకొనేలోపు బీజేపీ నాయకులు అక్కడ నుంచి ఉడాయించారు.


logo