మంగళవారం 26 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 18:05:14

వందేండ్ల బామ్మకు వేడుకగా జన్మదినం

వందేండ్ల బామ్మకు వేడుకగా జన్మదినం

కరీంనగర్‌:  జిల్లాలోని హుజరాబాద్ మండలం చిన్న పాపయ్య పల్లి గ్రామానికి చెందిన గీసిడి మాణిక్యమ్మ అనే వృద్ధురాలు జన్మదిన వేడుకలను ఆదివారం కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు రు. మాణిక్యమ్మ జన్మించి వంద ఏండ్లు కావడంతో కుటుంబ సభ్యులు అందరు హాజరై పండగ వాతావరణంలో కేక్ కట్ చేయించి శాలువాలతో సత్కరించారు. మాణిక్యమ్మకు నలుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. 56 మంది మనుమలు, మనుమరాళ్లు ఉండగా నలుగురు మునిమనుమలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికీ కూడా మాణిక్యమ్మ ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తానే చేసుకుంటున్నట్టు తెలిపారు.


logo