నిజామాబాద్ : జిల్లాలోని నవీపేట మండలం నాలేశ్వర్ గ్రామంలో రెండు తలలతో గొర్రె పిల్ల జన్మించింది. యజమాని సాయిలు ఇచ్చిన సమాచారంతో పశు సంవర్ధక శాఖ అధికారులు రెండు తలల గొర్రె పిల్లను పరీక్షించారు.
జన్యూ లోపంతో ఇలాంటి సంఘటన జరిగి ఉంటుందని వాళ్లు చెప్పారు. గంటసేపటి తర్వాత గొర్రెపిల్ల మృతి చెందినట్లు పశు వైద్యులు తెలిపారు. వింత ఆకారంలో జన్మించిన గొర్రెపిల్లను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు.
ఇవి కూడా చదవండి..
Prabhas 25: అర్జున్ డైరెక్టర్‌తో ప్రభాస్ 25వ చిత్రం.. పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్
Nallagonda | ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన గవర్నర్