ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 15:05:40

పీవీ శతజయంత్యుత్సవాలు.. ఫొటోలు

పీవీ శతజయంత్యుత్సవాలు.. ఫొటోలు

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవాలు ఆదివారం మొదలయ్యాయి. శతజయంతి ఉత్సవాలను  ఇవాళ ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు.  దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు సుమారు 70దేశాల్లో ఆయన జయంతి వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించింది.