గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 13:17:27

మొక్కల పెంపకంతోనే జీవకోటి మనుగడ

మొక్కల పెంపకంతోనే జీవకోటి మనుగడ

కరీంనగర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పౌరసరపరాల శాఖ మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని  37 వ డివిజన్ లో ఆరో విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పండ్లు , పూల మొక్కలు పంపిణీ చేశారు. మొక్కల పెంపకంతోనే జీవకోటి మనుగడ ఆధారపడి ఉంటుందన్నారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించేందుకు విరివిగా మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo