పశువులను నది దాటిస్తే కఠిన చర్యలు

- సోమశిల ఘటనపై పోలీసుల విచారణ
- 12 మందిపై బైండోవర్ కేసులు
- పశువుల రవాణాపై ఇంటెలిజెన్స్ ఆరా?
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
కొల్లాపూర్ రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల నుంచి సిద్ధేశ్వరానికి కృష్ణానదిలో పుట్టీల ద్వారా అమానవీయ రీతిలో పశువులను అక్రమంగా తరలించడాన్ని అడ్డుకునేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మరబోటు సాయంతో పశువులను నది దాటిస్తున్న తీరుపై ‘పుట్టికి కట్టి.. కాటికి’ అనే శీర్షిక తో బుధవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పం దించింది. ఈ కథనం పలువురిని కదిలించింది. ఈ ఘటనపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఆరా తీసినట్టు తెలిసింది. అసలు కృష్ణాతీరంలో ఏం జరుగుతోంది?, అక్రమదందా యథేచ్ఛగా జరిగేందుకు అధికారుల సహకారం ఏమైనా ఉన్నదా? అనే కోణంలోనూ పూర్తి స్థాయి లో ఆరా తీస్తున్నట్టు సమాచారం. కాగా బుధవారం ఈ ఘటనపై సీఐ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరిపి అందుకు బాధ్యులైన 12 మందిపై కేసులు నమోదు చేశారు. గ్రామ కార్యదర్శి రాఘవేందర్ ఫిర్యాదు మేరకు ఈ సంఘటనకు బాధ్యులైన సోమశిలకు చెందిన తెలుగురెడ్డిగారి మల్ల య్య, రెడ్డిగారి నిరంజన్, రెడ్డిగారి వెంకటస్వామి, రెడ్డిగారి రాముడు, రెడ్డిగారి కాశన్న, సందు తిరుపాలు, సందు కృష్ణయ్య, సున్నపు కుర్మయ్య, సున్నపు గంగన్న, సూగూరు కృష్ణయ్య, అంగలి మద్దిలేటి, రెడ్డిగారి వెంకటస్వామిని కొల్లాపూర్ తాసిల్దార్ ఎక్బాల్ ముందు బైండోవర్ చేశారు. సోమశిలకు వెళ్లి కృష్ణా ఒడ్డున ఉన్న బోటు యజమానులు, కూలీలతో సమావేశం ఏర్పాటు చేసి పశువులను నది దాటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
తాజావార్తలు
- ‘మాస్టర్’ వీడియో లీక్..నిర్మాత లీగల్ నోటీసులు
- కమలా హ్యారిస్.. కొన్ని ఆసక్తికర విషయాలు
- రోడ్డు ఊడ్చిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్
- సారీ చెప్పిన సల్మాన్..ఎగ్జిబిటర్లకు గుడ్‌న్యూస్
- ఆస్వాదించు..ఆనందించు
- ఏసీబీ వలలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి
- క్వారంటైన్లో ప్లేయర్స్.. 4 కోట్ల డాలర్ల ఖర్చు!
- వోగ్ మ్యాగ్జిన్ కవర్ పేజీలో రెండోసారి కమలా హ్యారిస్
- విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి?
- కుమారుడి హత్యకు తండ్రి 3 లక్షల సుపారీ