సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 21:02:42

మహిళను ఢీకొట్టిన బైకు..

మహిళను ఢీకొట్టిన బైకు..

హైదరాబాద్ : చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని  దిల్ సుఖ్ నగర్-ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయలు కొనుక్కుని రోడ్డు దాటుతున్నమంజుల అనే మహిళను ఓ వ్యక్తి బైక్ తో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో మంజులకు కాలు విరిగిపోయింది. బైకుపై వెళ్తున్న సాయికుమార్, మానసకు తీవ్ర గాయాలయ్యాయి. మానస పరిస్థితి విషమంగా ఉండటంతో..వారిని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

logo