శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 00:07:30

బిగ్‌బాస్‌ ఫేం నూతన్‌నాయుడి భార్యపై కేసు

బిగ్‌బాస్‌ ఫేం నూతన్‌నాయుడి భార్యపై కేసు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీలోని విశాఖపట్నంలో మరో దళిత యువకుడు శిరోముండనానికి గురయ్యాడు. ఈ ఘటనలో బిగ్‌బాస్‌ ఫేం నూతన్‌కుమార్‌నాయుడు భార్య సహా ఏడుగురిపై కేసు నమోదైంది. పోలీసులు కథనం ప్రకారం.. విశాఖలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, జనసేన నాయకుడు నూతన్‌నాయుడు ఇంట్లో దళిత యువకుడు కర్రి శ్రీకాంత్‌ పనిచేస్తున్నాడు. ఇటీవల చెప్పకుండా పనిమానేశాడు. ఆ కోపంతో.. ఇంట్లో ఫోన్‌ పోయిందంటూ శుక్రవారం శ్రీకాంత్‌ను పిలిపించి.. అతనిపై నూతన్‌ కుటుంబసభ్యులతోపాటు పలువురు దాడి చేసి, గుండు కొట్టించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. నూతన్‌ భార్య మధుప్రియ చెప్పినందుకే శిరోముండనం చేసినట్టు విచారణలో తేలింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలోనూ దళిత యువకుడికి గుండు కొట్టించిన ఘటన సంచలనమైంది. 


logo