గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 07:07:31

కుమ్రం భీం జిల్లాలో పెద్ద‌పులి అల‌జ‌డి

కుమ్రం భీం జిల్లాలో పెద్ద‌పులి అల‌జ‌డి

హైద‌రాబాద్‌: ‌కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెద్ద‌పులి మ‌రోమారు అల‌జ‌డి సృష్టిస్తున్న‌ది. రెండు రోజుల క్రితం ద‌హెగాం మండ‌లం దిగిడా గ్రామంలో ఓ యువ‌కుడి దాడి చేసింది. దీంతో అత‌డు మృతిచెందాడు. తాజాగా బెజ్జూరు మండ‌లంలో సంచ‌రిస్తున్న‌ది. దీంతో అట‌వీశాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయ‌రు. ప్రాణ‌హిత న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో పులి ఆచూకీ కోసం చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. ఇందులో భాగంగా పులి తిరుగుతున్న‌ద‌ని భావిస్తున్న ప్రాంతాల్లో 30 కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేశారు. అట‌వీ ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు అధికారులు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.