మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:12:54

సైకిల్‌గర్ల్‌ జ్యోతి హత్య అబద్ధం

సైకిల్‌గర్ల్‌ జ్యోతి హత్య అబద్ధం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఢిల్లీ నుంచి బీహార్‌లోని తన గ్రామానికి దాదాపు 1200 కిలోమీటర్లు సైకిల్‌పై తన తండ్రిని కూర్చోబెట్టుకుని తొక్కుకుంటూ వెళ్లిన సైకిల్‌ గర్ల్‌ జ్యోతి పాశ్వాన్‌పై మాజీ సైనికాధికారి ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న పోస్ట్‌ ఇది. 

వాస్తవానికి జ్యోతి పాశ్వాన్‌ క్షేమంగా, సురక్షితంగా ఉన్నారు. ఆమె పేరును పోలిన జ్యోతి కుమారి అనే బాలిక బీహార్‌లో హత్యకు గురైంది. అయితే ఎలాంటి లైంగిక దాడి జరుగలేదని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. మాజీ సైనికాధికారి ఇంట్లో ఆమె మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ అధికారిని, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. logo