శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 07:44:41

2022 సెప్టెంబర్‌నాటికి ఎయిమ్స్‌ పూర్తి

2022 సెప్టెంబర్‌నాటికి ఎయిమ్స్‌ పూర్తి

హైదరాబాద్ : బీబీనగర్‌లోని ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) నిర్మాణం 2022 సెప్టెంబర్‌ వరకు పూర్తవుతుందని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఎయిమ్స్‌ నిర్మాణం కోసం ఇప్పటివరకు కేంద్రం ఎన్ని నిధులను కేటాయించిందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. దాదాపు 1,028 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఎయిమ్స్‌ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి అన్నిచర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం పేర్కొన్నది. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫండింగ్‌ ఏజెన్సీ ద్వారా తొలివిడుతగా రూ.ఐదు కోట్లను విడుదల చేసినట్టు వెల్లడించింది. 


logo