e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home తెలంగాణ Bhuvangiri: రేల్వే స్టేషన్‌లోని సమస్యల పరిష్కారానికి కృషి: రాజ్యసభ సభ్యుడు బడుగుల

Bhuvangiri: రేల్వే స్టేషన్‌లోని సమస్యల పరిష్కారానికి కృషి: రాజ్యసభ సభ్యుడు బడుగుల

భువనగిరి అర్బన్: భువనగిరి రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి భువనగిరి రైల్వేస్టేషన్‌లోని టాయ్‌లె ట్స్, తాగునీటి నల్లాలు, పుట్ ఓవర్ బ్రిడ్జి సమస్యలను ప్రయాణికులను, రైల్వేగేటుతో అర్బన్‌కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని సమస్యలు వెంటనే పరిష్కరించేలా రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్టేషన్ టీవో లక్ష్మణ్‌ప్రసాద్, స్టేషన్ మాస్టర్ సంజయ్‌ను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 5న రైల్వే జీఎంతో ఎంపీలకు సమావేశం ఉందని, ఉమ్మడి జిల్లాలోని రైల్వే స్టేషన్ల సమస్యలను తెలుసుకుని జీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. భువనగిరి రైల్వేస్టేషన్ పురాతన మైనదని, ఇక్కడి నుంచి సుమారు 15వేల మంది హైదరాబాద్, వరంగల్‌కు, ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు రోజు వెళ్తుంటారని అన్నారు.

- Advertisement -

స్టేషన్‌లో కాకతీయ, పద్మావతి, శాతవాహాన, చార్మినార్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా, పుట్ ఓవర్ బిడ్జ్రిని ఎక్స్‌ టెన్షన్ చేయడంతో పాటు మరొక బ్రిడ్జిని ఏర్పాటు చేసేలా, అధునాతన టాయ్‌లెట్‌లు, సీసీ కెమెరాలు, క్యాంటీన్ ఓపెన్ చేయించడం, అర్బన్ కాలనీ రైల్వే గేటు వద్ద ైప్లెవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయించేలా, ప్రయాణికుల సూచిన మేరకు పలు మౌలిక వసతులను ఏర్పాటు చేసే విధంగా జీఎంను కోరనున్నట్లు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, మిర్యాలగూడ, నల్లగొండ, రామన్నపేట, ఆలేరు, దామరచర్ల, చిట్యాలతో పాటు అన్ని పెద్ద రైల్వేస్టేషన్‌లలో ప్రయాణి కులకు ఏ వసతులు ఉన్నాయి, ఏ వసతులు లేవని, తెలుసుకోవడానికి తనిఖీ చేస్తున్నా నని, ఈ వసతులను త్వరలో ఏర్పాటు చేసే విధంగా చూడాలని ఆక్టోబర్ 5న జరిగి సమావేశంలో రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఇందులో భాగంగా భువనగిరి రైల్వే స్టేషన్‌ను సందర్శించినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలో బస్టాండ్ ఏర్పాటుకు ఎంపీ నిధులు రూ.3లక్షలు కేటాయించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్ట య్య, డీసీసీబీ డైరెక్టర్ అందెల లింగం యాదవ్, టీఆర్‌ఎస్ పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శు లు గోమారి సుధాకర్‌రెడ్డి, జనగాం పాండు, నక్కల చిరంజీవి, నీల ఓం ప్రకాశ్‌గౌడ్, నాయకులు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, కడారి వినోద్, జహాంగర్, రాచమల్ల రమేశ్, భగత్, కిరణ్‌కుమార్, కొత్త నర్సింహా స్వామి, టప్పు, నాగారం ధీరజ్ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement