గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 15, 2020 , 01:55:01

పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్‌ భూమారెడ్డి పదవీకాలం పొడిగింపు

 పాడిపరిశ్రమాభివృద్ధి  సమాఖ్య చైర్మన్‌ భూమారెడ్డి  పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ లోకా భూమారెడ్డి పదవీకాలాన్ని  ప్రభుత్వం  మరో రెండేండ్లు పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన లోక భూమారెడ్డి 1981 నుంచి 1992 వరకు రుయ్యాడి గ్రామసర్పంచ్‌గా ఏకగ్రీవంగా పనిచేశారు. అనంతరం 1992లో జరిగిన సహకార ఎన్నికల్లో  ఉమ్డం ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం చైర్మన్‌గా ఎన్నికై, ఆదిలాబాద్‌ జిల్లా సహకారబ్యాంక్‌  చైర్మన్‌గా పనిచేశారు. 2001లో కేసీఆర్‌ పిలుపుమేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన భూమారెడ్డి.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2017 ఫిబ్రవరి 17న తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య తొలిచైర్మన్‌గా భూమారెడ్డిని సీఎం కేసీఆర్‌ నియమించారు. పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా మరోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు లోక భూమారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


logo