e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News బాచారం హై లెవల్ కెనాల్ పనులకు భూమి పూజ

బాచారం హై లెవల్ కెనాల్ పనులకు భూమి పూజ

బాచారం హై లెవల్ కెనాల్ పనులకు భూమి పూజ

నాగర్ కర్నూల్: జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని పెద్దకొత్తపల్లి, యాపట్ల, జగన్నాథపురం, మారేడుదిన్నే, చంద్రబండ తండా తదితర గ్రామాల పరిధిలోని దాదాపు పదివేల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు బాచారం హై లెవెల్ కెనాల్ నిర్మిస్తున్నట్లు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి తెలిపారు. బాచారం హై లెవల్ కెనాల్ పనుల కోసం సర్వే పనులకు ఆయన బుధవారం భూమి పూజ చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెనాల్ నిర్మాణంతో సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వచ్చే నెలలో డి.పి.అర్ తయారుచేసి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అడిగిన వెంటనే బాచారం హై లెవల్ కెనాల్ కోసం పరిపాలన అనుమతులు మంజూరు చేసిన సీఎం కేసీఅర్, మంత్రి కేటీఆర్ కు కొల్లాపూర్ రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్.ఈ విజయభాస్కర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

సీనియ‌ర్ జర్నలిస్టు శ్రీధ‌ర్ మృతిప‌ట్ల మంత్రి వేముల సంతాపం

కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాచారం హై లెవల్ కెనాల్ పనులకు భూమి పూజ

ట్రెండింగ్‌

Advertisement