గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 20:26:16

‘బీహెచ్ఈఎల్ కార్మిక, ఉద్యోగుల మద్దతు టీఆర్‌ఎస్‌కే’

‘బీహెచ్ఈఎల్ కార్మిక, ఉద్యోగుల మద్దతు టీఆర్‌ఎస్‌కే’

సంగారెడ్డి : బీహెచ్ఈఎల్ యూనియన్ మాజీ అధ్యక్షుడు జి.ఎల్లయ్యను బీహెచ్ఈఎల్ ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్‌ఎస్‌కు బీహెచ్ఈఎల్ ఉద్యోగ, కార్మిక కుటుంబాలన్నీ అండగా ఉంటాయని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు  ప్రకచించిన ఎల్లయ్యకు మంత్రి హరీశ్ రావు‌ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీహెచ్ఈఎల్ నడ్డి ‌విరిచే ప్రయత్నం చేస్తుంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు అప్పగించి పూర్వ వైభవం తీసుకువచ్చిందని మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. బీహెచ్ఈఎల్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్మిక, ఉద్యోగుల పక్షపాతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని చెప్పారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.