మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Feb 28, 2020 , 02:26:43

ఆర్టీసీ బస్సులో పైరసీకి అడ్డుకట్ట

ఆర్టీసీ బస్సులో పైరసీకి అడ్డుకట్ట
  • ప్రయాణికుడి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ తక్షణ స్పందన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో పైరసీని తక్షణమే అరికట్టాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ఖమ్మం డిపో బస్సులో కొత్త సినిమా వేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని గురువారం ఓ ప్రయాణికుడు ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేయగా.. దీనిపై కేటీఆర్‌ స్పందించారు.  పైరసీ సినిమా వేసినవారిపై చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సూచించారు. logo