శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 11:39:06

పాల సంద్రంలా 'భీమునిపాదం' జలపాతం

పాల సంద్రంలా  'భీమునిపాదం'     జలపాతం

వరంగల్‌:  రాష్ట్రవ్యాప్తంగా  వర్షాలు కురుస్తున్నాయి.  వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో  భీముని పాదం జలపాతం జలకళను  సంతరించుకున్నది.  భీముని పాదం జలపాతం  మహబూబాబాద్  జిల్లాలోని గుడూర్ మండలంలోని  సీతానాగారం శివారులో  ఉన్నది.  గుడూర్‌  బస్‌స్టాండ్‌ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 55 కిలోమీటర్లు, ఖమ్మం బస్ స్టేషన్ నుంచి 88 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ల  దూరంలో, దట్టమైన అడవిలో దాగి ఉంది.   ఇటీవల వర్షాలతో కొండల పైనుంచి దుముకుతూ కనువిందు చేస్తున్నాయి.  ఈ జలపాత ప్రాంతాలను మరింత అభివృద్ధి  చేసేందుకు అటవీశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది.  


logo