మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 11:32:45

భక్తిభావంతో కొలిస్తేనే కాపాడుతా.. భవిష్యవాణిలో స్వర్ణలత

భక్తిభావంతో కొలిస్తేనే కాపాడుతా.. భవిష్యవాణిలో స్వర్ణలత

హైదరాబాద్‌: కరోనాను కట్టడి చేసేందుకే తానునాన్నని, భక్తిభావంతో కొలిస్తేనే కాపాడుతానని స్వర్ణలత రంగం చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరు చేసుకున్న దానికి వాళ్లు అనుభవించక తప్పదు అని అన్నారు. ఐదు వారాలు సాకలు పోసి యజ్ఞహోమాలు చేయాలని ఆజ్ఞాపించారు. ఈఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని అన్నారు. గడపగడప నుంచి తనకు నైవేద్యాలు సమర్పించాలని చెప్పారు.


logo