గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 18:13:40

భార్గవ్‌ రామ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

భార్గవ్‌ రామ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌ :  బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ3 నిందితుడు భార్గవ్‌ రామ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సికింద్రాబాద్‌ కోర్టు కొట్టేసింది. భార్గవ్‌ రామ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఇటీవల ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ ఉదయం విచారణ జరిపింది. ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో భార్గవ్‌ రామ్‌కు ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

కాగా, భార్గవ్‌ రామ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు కోరారు.  అపహరణ కేసులో ఆయన ఏ-3 నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. అతడిని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేస్తూ సాయంత్రం నిర్ణయం తీసుకుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo