బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 16:54:33

సిద్దిపేట క‌లెక్ట‌ర్‌గా భార‌తి హోళికెరీ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

సిద్దిపేట క‌లెక్ట‌ర్‌గా భార‌తి హోళికెరీ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

సిద్దిపేట : సిద్దిపేట క‌లెక్ట‌ర్‌గా భార‌తి హోళికెరీ ఆదివారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ సిబ్బంది ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం పలువురు కలెక్టర్లను బదిలీ చేసిన విష‌యం తెలిసిందే. ముగ్గురికి స్థానచలనం కల్పించడంతో పాటు మరో ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మెదక్‌కు హన్మంతరావు, సంగారెడ్డికి వెంకట్రామిరెడ్డి, సిద్దిపేటకు భారతీ హోళికెరీని బదిలీ చేసింది. పెద్దపల్లి జిల్లా అదనపు బాధ్యతలు కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంకకు, మంచిర్యాల అదనపు బాధ్యతలు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌కు అప్పగించింది.