శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 28, 2020 , 08:44:08

భారత్‌పర్వ్‌-5లో తెలంగాణస్టాల్‌ను ప్రారంభించిన తెలంగాణ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌

భారత్‌పర్వ్‌-5లో తెలంగాణస్టాల్‌ను ప్రారంభించిన తెలంగాణ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: భారత్‌పర్వ్‌-5 లో తెలంగాణ రాష్ట్రం పాల్గొన్నది. కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జనవరి 26 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న భారత్‌పర్వ్‌-5లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకస్టాల్‌ను ఏర్పాటుచేసింది. ఈ స్టాల్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతం గిరి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభు త్వం మెప్మా ద్వారా ఈ స్టాల్‌ను ఏర్పాటుచేసింది. తెలంగాణ పర్యాటకం, గోల్కొండ హస్తకళలు, చేనేత వస్ర్తాలు, చేతివృత్తుల వస్తువులు, తెలంగాణ పిండివంటలను ఈ స్టాల్‌ లో ప్రదర్శనకు ఉంచారు.  30వ తేదీన తెలంగాణ సంస్కృతిని తెలియజేసేవిధంగా కళాకారులు జానపద, గిరిజననృత్యాలు ప్రదర్శించనున్నారు.  logo