బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 16:41:55

సీఎం సహాయనిధికి భారత్‌ బయోటెక్‌ 2 కోట్ల విరాళం

సీఎం సహాయనిధికి భారత్‌ బయోటెక్‌ 2 కోట్ల విరాళం

హైదరాబాద్‌ : కరోనా సహాయక చర్యల కోసం సీఎం సహాయనిధికి భారత్‌ బయోటెక్‌ భారీ విరాళం ఇచ్చింది. సీఎం సహాయనిధికి రూ. 2 కోట్లు విరాళం ఇచ్చింది భారత్‌ బయోటెక్‌. సీఎం కేసీఆర్‌కు భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, ఎండీ కృష్ణ ఎం. ఎల్లా, సుచిత్ర కె. ఎల్లా కలిసి చెక్కును అందజేశారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ ఆవిష్కరించనున్నట్లు కృష్ణ ఎం. ఎల్లా వెల్లడించారు. 

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. కరోనా సహాయక చర్యల కోసం పలువురు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ చర్యలకు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితులు, లాక్‌డౌన్‌ వంటి కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కొనసాగుతోంది.


logo