గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 13:55:49

సామూహిక నిమజ్జనం వద్దు.. సామాజిక దూరం పాటిద్దాం..

సామూహిక నిమజ్జనం వద్దు.. సామాజిక దూరం పాటిద్దాం..

హైదరాబాద్‌ : కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించుకోవాలని భాగ్యనగర ఉత్సవ సమితి నగర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్‌ 1వ తేదీన సామూహిక నిమజ్జనం వీలుకాదు అని ఉత్సవ సమితి స్పష్టం చేసింది. సామాజిక దూరం పాటిస్తూ నిమజ్జనాలు చేసుకోవాలని సూచించింది. గణేశ్‌ విగ్రహాల ఎత్తుల విషయంలో కూడా పోటీ పడొద్దు అని కోరింది. మండపాల వద్ద నలుగురైదుగురు మాత్రమే ఉండాలి. పూజా సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. ప్రతి మండపం వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఉత్సవ సమితి సూచించింది. వినాయకుడి పూజకు ఆటంకం లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని భాగ్యనగర ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది. 


logo