శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 02:39:02

భగీరథ నీళ్లే తాగండి

భగీరథ నీళ్లే తాగండి

  • పంచాయతీ నుంచి సచివాలయం దాకా
  • భగీరథ నీళ్ల బాటిళ్లే వాడాలి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం చేప్టటిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజలకు సురక్షితమైన, స్వచ్ఛమైన మంచినీళ్లు అందుబాటులోకి వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. భగీరథ నీళ్లలో అన్నిరకాల మినరల్స్‌ తగిన పాళ్లలో ఉన్నందున ప్రజలు ఈ నీటినే తాగాలని పిలుపునిచ్చారు. ప్రగతిభవన్‌లో శనివారం సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్‌ భగీరథ నీళ్లు తాగేలా ప్రజలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. భగీరథ నీళ్లు ప్రస్తుతం బాటిళ్లలో అందుబాటులోకి వచ్చాయన్నారు. గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు వాటినే వినియోగించాలని స్పష్టంచేశారు. మిషన్‌ భగీరథకు నీరివ్వడానికి అన్ని రిజర్వాయర్లలో కనీస నిల్వలను కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

VIDEOS

logo