బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 13:52:32

సరస్వతీ దేవిగా వరంగల్‌ భద్రకాళి

సరస్వతీ దేవిగా వరంగల్‌ భద్రకాళి

వరంగల్‌ : దేవి శరన్నవరాతి ఉత్సవాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. భద్రకాళి అమ్మవారు నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అవతారంలో దర్శనిమస్తుండగా .. భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నవరాత్రి వేడుకల్లో ఏడో రోజు వారు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. హంసవాహనంపై కొలువుదీరి, చేతిలో వీణతో భక్తులను అనుగ్రహించింది. ఉదయం ఆలయంలో కాళరాత్రి దుర్గా అర్చన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం రథోత్సవం కార్యక్రమం జరుగనుంది. చదువుల తల్లిగా దర్శించనమిచ్చిన అమ్మవారిని పెద్దసంఖ్యలో వచ్చి భక్తులు దర్శించుకున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.